50వ టెస్టులోనూ మెరుగ్గా రాణిస్తా: పుజారా | Pujara wants to improve as he approaches 50th Test | Sakshi
Sakshi News home page

50వ టెస్టులోనూ మెరుగ్గా రాణిస్తా: పుజారా

Jul 31 2017 12:14 AM | Updated on Sep 5 2017 5:13 PM

50వ టెస్టులోనూ మెరుగ్గా రాణిస్తా: పుజారా

50వ టెస్టులోనూ మెరుగ్గా రాణిస్తా: పుజారా

శ్రీలంకతో జరగబోయే రెండో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు భారత స్టార్‌ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తెలిపాడు.

శ్రీలంకతో జరగబోయే రెండో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు భారత స్టార్‌ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తెలిపాడు. ఈ మ్యాచ్‌ అతడి కెరీర్‌లో 50వ టెస్టు కానుంది. ‘ఇప్పటిదాకా నా కెరీర్‌ అద్భుతంగా సాగింది. దేశం తరఫున 50వ టెస్టు ఆడబోతుండటం గర్వంగా అనిపిస్తోంది.

కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నా ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే తదుపరి మ్యాచ్‌లోనూ పరుగులు సాధిస్తాననే నమ్మకముంది. కెరీర్‌లో గాయాలు కూడా నన్ను తీవ్రంగా బాధించాయి’ అని పుజారా అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement