‘హాఫ్‌ సెంచరీ’లో 9 ఫోర్లు.. 1 సిక్స్‌

Pujara Gets Fifty After Rohit Another Key Innings - Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన చతేశ్వర పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. 106 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు. తొలుత కుదురుగా ఆడిన పుజారా.. ఆపై తన శైలికి భిన్నంగా బౌండరీల మోత మోగించాడు. పుజారా హాఫ్‌ సెంచరీ సాధించే క్రమంలో 9 ఫోర్లు, 1 సిక్స్‌ సాధించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.  పుజారా 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఫోర్‌ కొట్టి మరీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. పుజారా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవడానికి 42 పరుగులు ‘బౌండరీ’ల రూపంలోనే సాధించాడు.

అంతకుముందు రోహిత్‌ శర్మ హాఫ్‌సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన యువ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్‌కు జత కలిసిన పుజారా ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ లయ తప్పిన బంతుల్ని మాత్రం బౌండరీలు దాటించారు. ఈ జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top