
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆరో సీజన్ ముందనుకున్న షెడ్యూల్ కంటే రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. వచ్చే నెల 5న ఆరంభం కావాల్సిన ఈ లీగ్ 7వ తేదీకి మారింది. మూడు నెలలపాటు సుదీర్ఘంగా జరిగే ఈ లీగ్ ఏర్పాట్లలో తలెత్తిన సమస్యల వల్ల రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు టోర్నీ నిర్వాహక సంస్థ మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది.
ఫైనల్ పోరు వచ్చే ఏడాది జనవరి 5న ముంబైలో జరుగుతుంది. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.