
చెన్నై: రైడర్లు దీపక్, వికాస్, వజీర్‌లు రాణించడంతో హరియాణా స్టీలర్స్ ప్రొ కబడ్డీ లీగ్‌లో పదో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హరియాణా 41–30 స్కోరుతో యు ముంబాపై ఘనవిజయం సా ధించింది. దీపక్, వికాస్ చెరో 8 పాయింట్లు సా ధించగా... వజీర్ సింగ్ 7 పాయింట్లు చేశాడు. జట్టు మొత్తం రైడింగ్ పాయింట్ల (24)లో ఈ త్రయం వాటానే 23 పాయింట్లు ఉండటం గమనార్హం.
యు ముంబాలో అనూప్ కుమార్ (10) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 37–33 స్కోరుతో తమిళ్ తలై వాస్‌ను కంగుతినిపించింది. యూపీ తరఫున నితిన్ తోమర్ 12 పాయింట్లు చేశాడు. తలైవాస్ జట్టులో అజయ్ ఠాకూర్ 15 పాయింట్లు సాధించాడు. గురువారం జరిగే మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ తలపడుతుంది.