
అహ్మదాబాద్: ఆరంభంలో తడబడినా... పవన్ అసాధారణ పోరాటంతో ఓడాల్సిన మ్యాచ్‌ను డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ గెలిచింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫలితం కోసం అదనపు సమయం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 48–45తో యూపీ యోధపై విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 36–36తో సమంగా నిలిచాయి.
విజేతను నిర్ణయించేందుకు ఆరు నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. అదనపు సమయంలో వవన్ సూపర్ రైడ్‌తో చెలరేగడంతో బెంగళూరు బుల్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. పవన్‌కు సుమిత్ సింగ్ (7 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) సహకరించారు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో యు ముంబా 46–38తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.