
పృథ్వీ షా
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సోమవారం అరంగేట్రం చేసిన భారత్ అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీ షా అరుదైన రికార్డును నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కారు. సోమవారం నాటికి పృథ్వీ షా వయసు 18 సంవత్సరాల 165 రోజులు. అంతకుముందు రిషబ్ పంత్ (18 ఏళ్ల 212 రోజులు) ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున 2017లో ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేశారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో సోమవారం ఆడిన మ్యాచ్‌లో పృథ్వీ షా 10 బంతుల్లో 22 పరుగులు చేశారు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.