ధోని.. నా హెలికాప్టర్‌ షాట్లు చూడు!

Poonam Shares A Girl Video Of MS Dhoni's Helicopter Shots Viral - Sakshi

ఆగ్రా: ప్రపంచ క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని హెలికాప్టర్‌ షాట్లకు చాలా క్రేజ్‌ ఉంది. ఈ షాట్లను చాలా మంది క్రికెటర్లు ప్రయత్నించినా పెద్దగా సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు. కొన్ని సందర్భాల్లో భారత ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా హెలికాప్టర్‌ షాట్లను కొట్టడం మనం చూశాం. అయితే ఒక బాలిక ధోని తరహాలో హెలికాప్టర్‌ షాట్లను కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను భారత మహిళా క్రికెటర్‌ పూనమ్‌ యాదవ్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. (‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని మళ్లీ చూద్దామా!)

దీనికి ‘దిస్‌ ఈజ్‌ క్రేజీ’ అనే క్యాప్షన్‌ ఇచ్చిన పూనమ్‌.. ఎంఎస్‌ ధోనికి, సురేశ్‌ రైనా, బీసీసీఐలకు ట్యాగ్‌ చేశారు.ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లోని క్రీడా ఈవెంట్లు ఇంకా పునరుద్ధరించలేదు. దాంతో క్రీడాకారులంతా తమ తమ ఇళ్లలోనే ఉంటూ సోషల్‌ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఘటనలపై స్పందిస్తూ తమ అభిప్రాయాల్ని షేర్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పూనమ్‌ యాదవ్‌కు ఈ వీడియో తారస పడగా దాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. (‘రోహిత్‌ కాదు.. కోహ్లినే)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top