స్వచ్ఛ భారత్‌లో గుత్తా జ్వాల | PM Modi lauds Chanda Kochhar, Jwala Gutta for 'Swach Bharat initiatives' | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్‌లో గుత్తా జ్వాల

Nov 12 2014 12:32 AM | Updated on Sep 2 2017 4:16 PM

స్వచ్ఛ భారత్‌లో గుత్తా జ్వాల

స్వచ్ఛ భారత్‌లో గుత్తా జ్వాల

సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకుంది.

సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించింది. అలాగే స్టేడియం ఆవరణలో ఉన్న వాణిజ్య దుకాణదారులు తమ చెత్తను రోడ్డుపై వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరింది.

అపరిశుభ్ర వాతావరణంతో క్రీడాకారుల ఆరోగ్యానికి హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ప్రతీరోజు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ సిబ్బంది, స్వీపర్ల ప్రయోజనాలను ప్రభుత్వం నెరవేర్చాలని జ్వాల విజ్ఞప్తి చేసింది. ఈసందర్భంగా స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని ఎంపీ కల్వకుంట్ల కవిత, అశ్విని, దీపికా పదుకొనె, ఆమిర్ ఖాన్, ఓజా, నితిన్ పేర్లను ఆమె నామినేట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement