అయ్యో పంత్! | Pant shocking dismissed | Sakshi
Sakshi News home page

అయ్యో పంత్!

May 10 2017 10:26 PM | Updated on Sep 5 2017 10:51 AM

అయ్యో పంత్!

అయ్యో పంత్!

ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ కు వింత అనుభవం ఎదురైంది.

కాన్పుర్: గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ కు వింత అనుభవం ఎదురైంది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ప్రదీప్ సంగ్వన్ శాంసన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చిరావడంతోనే ఫోర్ కొట్టాడు. మరుసటి బంతిని ఆడబోయిన రిషబ్ వింతగా రనౌటై అందరినీ ఆశ్చర్యపర్చాడు. 
 
 లెగ్ సైడ్ ఆడబోయిన పంత్ బంతి ప్యాడ్ కు తగలడంతో సంగ్వన్ అప్పీల్ చేశాడు. వేంటనే బంతిని అందుకున్న సురేశ్ రైనా వికెట్ల వైపు విసరడంతో నేరుగా తగిలింది. పంత్ క్రీజులో లేక పోవడంతో రనౌట్ గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇది కనురెప్పపాటులో జరగడంతో స్టేడియం అంతా హతాశులయ్యారు. అంపైర్ దర్ఢ్ ఎంపైర్ కి నివేదించినా రిషబ్ క్రీజు నుంచి వెనుదిరిగాడు. రిషబ్ గుజరాత్ తో జరిగిన గత మ్యాచ్ లో సునామి ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement