పంకజ్‌కు మూడో గెలుపు | Pankaj Advani, Kamal Chawla inch closer to World Snooker knockouts | Sakshi
Sakshi News home page

పంకజ్‌కు మూడో గెలుపు

Nov 22 2014 12:45 AM | Updated on Sep 2 2017 4:52 PM

పంకజ్‌కు మూడో గెలుపు

పంకజ్‌కు మూడో గెలుపు

తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశాడు.

 ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్
 
 బెంగళూరు: తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘హెచ్' లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4-0 (103-4, 119-7, 56-26, 136-0) ఫ్రేమ్‌ల తేడాతో పాల్ ష్కాఫ్ (ఆస్ట్రియా)పై గెలిచాడు. హైదరాబాద్ ప్లేయర్ లక్కీ వత్నాని వరుసగా రెండో మ్యాచ్‌లో నెగ్గాడు.

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్కీ 4-3 (14-65, 30-75, 86-22, 65-43, 46-54, 88-0, 65-22) ఫ్రేమ్‌ల తేడాతో నొబ్రెస్ (బ్రెజిల్)ను ఓడించాడు. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక మొత్తం 16 గ్రూప్‌ల నుంచి నలుగురు చొప్పున 64 మంది నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement