టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ యాసిర్ షా.. | Pakistan's Yasir Shah becomes number one Test bowler | Sakshi
Sakshi News home page

టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ యాసిర్ షా..

Jul 19 2016 9:04 AM | Updated on Sep 4 2017 5:19 AM

టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ యాసిర్ షా..

టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ యాసిర్ షా..

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లతో చెలరేగిన పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

టెస్టుల్లో పాక్ బౌలర్ కు నం.1 ర్యాంకు
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లతో చెలరేగిన పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. యాసిర్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలిటెస్టులో పాక్ 75 పరుగులతో నెగ్గిన విషయం తెలిసిందే. 1996లో ముస్తాక్ అహ్మద్ తర్వాత టెస్టుల్లో నం.1 ర్యాంక్ సాధించిన పాక్ బౌలర్‌గా యాసిర్ నిలిచాడు. అయితే ముస్తాక్ కూడా లెగ్ స్పిన్నర్ కావడం విశేషం.

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 2005లో టాప్ ర్యాంకులో నిలవగా, ఆ తర్వాత యాసిర్ తప్ప మరో లెగ్ స్పిన్నర్ నెం.1 ర్యాంకు సాధించలేదు. ఇప్పటివరకూ టాప్ ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఈ మ్యాచ్కు దూరమవడంతో అతడు మూడోస్థానానికి పడిపోగా, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2వ, ఇంగ్లండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ 4వ స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement