ఆఫ్రిది అది చట్టవిరుద్దం! | Pakistan Cricketer Afridi Criticised For Keeping Lion Chained At Home | Sakshi
Sakshi News home page

ఆఫ్రిది అది చట్టవిరుద్దం!

Jun 12 2018 4:15 PM | Updated on Jul 25 2018 1:57 PM

Pakistan Cricketer Afridi Criticised For Keeping Lion Chained At Home - Sakshi

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ట్విటర్‌లో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ జంతుప్రేమికుల ఆగ్రహానికి గురైంది. ‘జంతువులను రక్షించడం మర్చిపోకండి, వాటికి మన ప్రేమ ఎంతో అవసరం ఉందంటూ’  జింకకు పాలు తాగిస్తూ దిగిన ఫోటో, తన కూతురు ఫోటోను బూమ్‌ బూమ్‌ ఆఫ్రిది షేర్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆల్‌రౌండర్‌ షేర్‌ చేసిన ఫోటోలో తన కూతురుతో పాటు ఆమె వెనకాలా ఓ పెద్ద సింహాన్ని గొలుసుతో కట్టేసి ఉంచారు. 

దీనిపై ఆగ్రహించిన జంతు ప్రేమికులు స్వేచ్చగా అడవిలో తిరగాల్సిన సింహాన్ని ఇలా గోలుసులతో కట్టిపడేస్తే జంతువులను ప్రేమించటం కాదని ఘాటుగా స్పందించారు. ఇక మరికొందరు క్రూర జంతువులను ఇళ్లలో పెంచుకోవడం చట్టవిరుద్దమని ఆఫ్రిదిని కడిగిపాడేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆఫ్రిది ఎలాంటి వివరణ ఇవ్వలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement