సత్తాచాటిన ఓక్రిడ్జ్ జట్లు | Oakridge teams sucessful in game | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన ఓక్రిడ్జ్ జట్లు

Aug 23 2013 12:02 AM | Updated on Sep 1 2017 10:01 PM

అంతర్ పాఠశాలల క్రీడల్లో ఓక్రిడ్జ్ స్కూల్ జట్లు సత్తా చాటాయి. టెన్నిస్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ పోటీల్లో ఈ స్కూల్ విద్యార్థులు ఘన విజయాలు నమోదు చేశారు.

రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల క్రీడల్లో ఓక్రిడ్జ్ స్కూల్ జట్లు సత్తా చాటాయి. టెన్నిస్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ పోటీల్లో ఈ స్కూల్ విద్యార్థులు ఘన విజయాలు నమోదు చేశారు. అండర్-12, 14 టెన్నిస్ విభాగాల్లో ఓక్రిడ్జ్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం జరిగిన సెమీఫైనల్ పోటీల్లో ఓక్రిడ్జ్ జట్టు 2-0తో డీపీఎస్ స్కూల్‌పై, అండర్-14 విభాగంలో ఓక్రిడ్జ్ స్కూల్ 2-0తో డీఆర్‌ఎస్ స్కూల్‌పై విజయం సాధించాయి.
 
 ఇతర సెమీస్ పోటీల్లో జేహెచ్‌పీఎస్ 2-1తో గ్లెన్‌డెల్ స్కూల్‌పై, శ్రీనిధి స్కూల్ 2-0తో ఓక్రిడ్జ్ స్కూల్ (బాచుపల్లి)పై గెలుపొందాయి. బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో చిరెక్, ఓక్రిడ్జ్ బాల, బాలికల జట్లు తుదిపోరుకు అర్హత సంపాదించాయి. బాలికల సెమీఫైనల్లో చిరెక్ స్కూల్ 34-27తో డీపీఎస్‌ను, ఓక్రిడ్జ్ స్కూల్ 31-10తో సీఆర్‌పీఎఫ్‌ను కంగుతినిపించాయి. బాలుర ఈవెంట్‌లో ఓక్రిడ్జ్ జట్టు 71-42తో సీఆర్‌పీఎఫ్‌పై గెలుపొందగా, చిరెక్ జట్టు 45-25తో సెయింట్ ఆండ్రూస్‌పై నెగ్గింది.
 
  స్విమ్మింగ్ అండర్-14 బాలుర విభాగం 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో ఓక్రిడ్జ్‌కు చెందిన పి.శుభ మ్, ఆర్.గోవింద్ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వినీత్‌రెడ్డి (మెరిడియన్ స్కూల్) తృతీయ స్థానం పొందాడు. బాలికల విభాగంలో ఓక్రిడ్జ్ అమ్మాయిలు ఆర్తి, శ్రీనిధి, శృతి క్లీన్‌స్వీప్ చేశారు. అండర్-10 బాలుర విభాగం 25 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో ఆగస్త్య (డీపీఎస్), అఖిల్ (ఇండస్ స్కూల్), ఇమ్రాన్ (ఓక్రిడ్జ్) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో జాహ్నవి (డీపీఎస్) విజేతగా నిలువగా, రక్ష (ఓక్రిడ్జ్), ప్రేరణ (డీపీఎస్) రెండు, మూడు స్థానాలు పొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement