మాడ్రిడ్‌ ఓపెన్‌ ‘మాస్టర్‌’ నొవాక్‌ జొకోవిచ్‌  | Novak Djokovic solidifies grip on ATP rankings after Madrid Open | Sakshi
Sakshi News home page

మాడ్రిడ్‌ ఓపెన్‌ ‘మాస్టర్‌’ నొవాక్‌ జొకోవిచ్‌ 

May 14 2019 12:23 AM | Updated on May 14 2019 12:30 AM

Novak Djokovic solidifies grip on ATP rankings after Madrid Open - Sakshi

ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 క్లే కోర్టు టోర్నీలో మూడో సారి చాంపియన్‌గా నిలిచాడు. గ్రీస్‌ యువతార సిట్సిపాస్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌ 6–4, 6–4తో గెలిచాడు. విజేత జొకోవిచ్‌కు 12,02,520 యూరోల (రూ. 9 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 33వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు.    

Advertisement
 
Advertisement
Advertisement