నార్త్ జోన్ గెలుపు | north zone team won by 3 wickets against with west zone team | Sakshi
Sakshi News home page

నార్త్ జోన్ గెలుపు

Dec 13 2013 12:15 AM | Updated on Sep 2 2017 1:32 AM

జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు 3 వికెట్ల తేడాతో వెస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించింది.

జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ మీట్
 జింఖానా, న్యూస్‌లైన్: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు 3 వికెట్ల తేడాతో వెస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించింది. అంబర్‌పేట మైదానంలో గురువారం మొదట బ్యాటింగ్ చేసిన  వెస్ట్ జోన్ 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. విద్యాసాగర్ 26, జగదీశ్వర్ రెడ్డి 22 పరుగులు చేశారు.  కార్తీక్ 4, ఆనంద్ 2 వికెట్లు తీశారు. తర్వాత బరిలోకి దిగిన నార్త్ జోన్ 14 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. అనిల్ 26, అదిల్ 24 పరుగులు చేశారు.
 
 జీహెచ్‌ఎంసీ వెస్ట్ జోన్ బౌలర్లు జ్ఞానేశ్వర్, మల్లికార్జున్ చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. మరో మ్యాచ్‌లో జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్ జట్టు పరుగు తేడాతో జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ జట్టుపై గెలుపొందింది. తొలుత బరిలోకి దిగిన జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్ 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. రాజారామ్ 26, రఘు 24, ప్రవీణ్‌చంద్ర 20 పరుగులు చేశారు. జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ బౌలర్లు ర మేష్ 3, రవీందర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ 14.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement