
లండన్: ఫార్ములావన్ (ఎఫ్1) రేసుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్రైవర్లలో ఎవరికైనా కరోనా సోకినా... పోటీ మాత్రం ఆగదని ఎఫ్1 సీఈఓ చేజ్ క్యారీ స్పష్టం చేశారు. ‘వైరస్‌తో డ్రైవర్ లేదంటే టీమ్ పాల్గొనలేకపోయినా... రేసుకు ఢోకా ఉండదు. ఆ గ్రాండ్‌ప్రిని రద్దు చేయం. దీనికి సంబంధించిన కచ్చితమైన ప్రణాళికతో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రేసులు జరుగుతాయి. ఒకవేళ డ్రైవర్ కరోనా బారిన పడితే రిజర్వ్ డ్రైవర్లయితే ఉంటారుగా. భౌతిక దూరం లోపించినా కూడా వలయంతో రక్షణ పద్ధతుల్ని అనుసరిస్తాం. ఇందులో ఎదురయ్యే ఇబ్బందుల్ని, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎఫ్1 సిద్ధంగా ఉంది’ అని క్యారీ వెల్లడించా రు. మార్చిలో ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవ్వాల్సిన సీజన్ కరోనాతో ఇంకా ప్రారంభం కాలేదు.