షకిబుల్‌కు భారీ ఊరట

 No legal Action But Shakib Has To Reply To Showcause Notice - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకిబుల్‌ హసన్‌కు భారీ ఊరట లభించింది. ఇటీవల బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన షకిబుల్‌.. ఒక స్థానిక టెలికాం సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఇది బోర్డు నియమావళిని అతిక్రమించనట్లు కావడంతో షకిబుల్‌పై చర్యలు తీసుకోవాలని బీసీబీ భావించింది.  ఈ క్రమంలోనే బీసీబీ పంపిన షోకాజ్‌ నోటీసుకు పంపిన కొన్ని గంటల వ్యవధిలోనే మనసు మార్చుకుంది. దీనిపై బీసీబీ అధ్యక్షుడు  నజ్ముల్‌ హసన్‌ మాట్లాడుతూ.. ‘ ఇది బోర్డు అంతర్గత వ్యవహారం. దీనికి ఇక్కడితే ముగింపు పలకాలని అనుకుంటున్నాం. అతనిపై ఎటువంటి యాక్షన్‌ తీసుకోవాలని అనుకోవడం లేదు.  అయితే  జాతీయ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాడు ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు అనే దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

అంతకుముందు షకిబుల్‌పై సీరియస్‌గా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు నజ్ముల్లా తెలిపిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌22వ తేదీన గ్రామీఫోన్‌ టెలికాం సంస్థకు షకిబుల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. దాంతో బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ మా నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన ఏ ఒక్క క్రికెటర్‌ను ఉపేక్షించేది లేదు. మాకు షకీబుల్‌ పరిహారం చెల్లించుకోవాల్సింది. కంపెనీతో పాటు సదరు ఆటగాడు కూడా మాకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే. దీనిపై ఇప్పటికే కంపెనీ నుంచి పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసు పంపాం. షకీబుల్‌ దీనిపై వివరణ ఇవ్వాలని కోరతాం.. దాంతో పాటు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే కఠినమైన చర‍్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top