పోరాడి ఓడిన నివేదిత  | Nivedita Defeated In First Round Of Senior Table Tennis | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన నివేదిత 

Feb 1 2020 10:02 AM | Updated on Feb 1 2020 10:02 AM

Nivedita Defeated In First Round Of Senior Table Tennis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సింగిల్స్‌ విభాగంలో తెలంగాణకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం మహిళల సింగిల్స్‌ విభాగంలో తలపడిన ఐదుగురు రాష్ట్ర క్రీడాకారుల్లో కేవలం ఒకరు మాత్రమే ముందంజ వేశారు.  ప్రణీత, లాస్య, నివేదిత, నిఖిత తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా వరుణి జైస్వాల్‌ ముందంజ వేసింది. శుక్రవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ బ్యాచ్‌లో వరుణి జైస్వాల్‌ 3–1తో తనుశ్రీ దాస్‌గుప్తా (మేఘాలయ)పై విజయం సాధించింది. 

మరో మ్యాచ్‌లో నివేదిత 2–3తో మానసి (మహారాష్ట్ర) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణీత గర్లపాటి (తెలంగాణ) 2–3తో క్రితిక ఉపాధ్యాయ (రైల్వేస్‌) చేతిలో, వి. లాస్య 1–3తో సన్య సెహగల్‌ (హరియాణా) చేతిలో, నిఖిత (తెలంగాణ) 0–3తో వరి్టకా భరత్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్లు బి. నాగశ్రావణి 2–3తో నేహా (పంజాబ్‌) చేతిలో, ఫల్గుణి చార్వి 0–3తో నిత్యాశ్రీ మణి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల విభాగంలో టాప్‌ సీడ్‌ జి. సత్యన్, రెండో సీడ్‌ ఎ. శరత్‌కమల్‌లకు తొలి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement