క్వార్టర్స్‌లో నిఖత్‌ | Nikhat Zareen advances in Thailand Open boxing tourney | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో నిఖత్‌

Jul 22 2019 6:17 AM | Updated on Jul 22 2019 6:17 AM

Nikhat Zareen advances in Thailand Open boxing tourney - Sakshi

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్‌ జరీన్, మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ (56 కేజీలు) శుభారంభం చేశారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్‌ జరీన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరగా... హుసాముద్దీన్‌ రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన నిఖత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 5–0తో తస్మీన్‌ బెన్నీ (న్యూజిలాండ్‌)పై గెలిచింది. హుసాముద్దీన్‌ తొలి రౌండ్‌లో 4–1తో యుతాపోంగ్‌ థోంగ్‌డి (థాయ్‌లాండ్‌)ను ఓడించాడు.

Advertisement
 
Advertisement
Advertisement