మెయిడిన్‌ వికెట్‌ హెట్‌మెయిర్‌..

Navdeep Saini Gets Hetmyer Out As Maiden Odi Wicket - Sakshi

కటక్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డే ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా పేసర్‌ నవదీప్‌ సైనీ తన మెయిడిన్‌ వికెట్‌గా హెట్‌మెయిర్‌ వికెట్‌ను సాధించాడు. నవదీప్‌ సైనీ వేసిన 30 ఓవర్‌ రెండో బంతిని హెట్‌మెయిర్‌ పుల్‌ చేయగా అది కాస్తా క్యాచ్‌గా గాల్లోకి లేచింది. దీన్ని కుల్దీప్‌ యాదవ్‌ క్యాచ్‌గా అందుకోవడంతో హెట్‌మెయిర్‌ ఇన్నింగ్స్‌ 37 పరుగుల వద్ద ముగిసింది. దాంతో విండీస్‌ 132 పరుగుల వద్ద మూడో  వికెట్‌ను నష్టపోయింది. కాగా, సైనీ వేసిన తదుపరి ఓవర్‌లో రోస్టన్‌ ఛేజ్‌(38)ని బౌల్డ్‌ చేయడంతో వెస్టిండీస్‌ కష్టాల్లో  పడింది. స్వల్ప విరామాల్లో సైనీ రెండు వికెట్లు సాధించి మంచి బ్రేక్‌ ఇవ్వడంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టుబిగించింది. అంతకుముందు షాయ్‌ హోప్‌(42) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఎవిన్‌ లూయిస్‌(21) తొలి వికెట్‌గా ఔటయ్యాడు.(ఇక్కడ చదవండిసెన్సేషనల్‌ క్యాచ్‌.. జస్ట్‌ మిస్‌)

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో విండీస్‌ బ్యాటింగ్‌ను లూయిస్‌, హోప్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల  జత చేసిన తర్వాత లూయిస్‌ ఔట్‌ కాగా, కాసేపటికి హోప్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. లూయిస్‌ను  జడేజా పెవిలియన్‌కు పంపగా, హోప్‌ను మహ్మద్‌ షమీ ఔట్‌ చేశాడు. ఆపై రోస్టన్‌ ఛేజ్‌కు హెట్‌మెయిర్‌ జత కలిశాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సైనీ బౌలింగ్‌లో హెట్‌మెయిర్‌ ఔటయ్యాడు.. మరో 12 పరుగుల వ‍్యవధిలో చేజ్‌ను సైతం సైనీ  బౌల్డ్‌ చేసి భారత్‌ శిబిరంలో ఆనందం నింపాడు. 35 ఓవర్లు ముగిసే సరికి విండీస్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top