నాసర్ స్కూల్ గెలుపు | Nasser School win | Sakshi
Sakshi News home page

నాసర్ స్కూల్ గెలుపు

Aug 23 2014 1:23 AM | Updated on Sep 4 2018 5:07 PM

నాసర్ స్కూల్ గెలుపు - Sakshi

నాసర్ స్కూల్ గెలుపు

ఐసీఎస్‌ఈ స్కూల్స్ 23వ ప్రాంతీయ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ప్రారంభమైంది.

ఐసీఎస్‌ఈ ప్రాంతీయ స్పోర్ట్స్ మీట్
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్‌ఈ స్కూల్స్ 23వ ప్రాంతీయ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని ఐసీఎస్‌ఈ స్కూళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలిరోజు జరిగిన హాకీ మ్యాచ్‌లో నాసర్ స్కూల్ (బాలుర) జట్టు 6-2 తేడాతో సెయింట్ జోసెఫ్ స్కూల్ (హబ్సిగూడ)పై గెలుపొందింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నాసర్ జట్టు.. చివరిదాకా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని కట్టడి చేసింది.

కెప్టెన్ షాలాన్ సిద్దిఖ్, మొహియుద్దీన్‌లు రెండేసి గోల్స్‌ను అందించగా, అలీ అజీజ్, ఆదిల్ అన్సారి చెరో గోల్ సాధించి నాసర్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు.  సెయింట్ జోసెఫ్ జట్టు తీవ్రంగా పోరాడినా.. రెండు గోల్స్‌తోనే సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాసర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మీర్ ఖుత్బుద్దీన్ ఖాన్ పాల్గొని టోర్నీని ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement