'మ్యాక్స్ వెల్ మళ్లీ వచ్చాడు' | Mumbai Indians win the toss and choose to bat | Sakshi
Sakshi News home page

'మ్యాక్స్ వెల్ మళ్లీ వచ్చాడు'

May 13 2016 7:41 PM | Updated on Sep 4 2017 12:02 AM

'మ్యాక్స్ వెల్ మళ్లీ వచ్చాడు'

'మ్యాక్స్ వెల్ మళ్లీ వచ్చాడు'

మ్యాక్స్ వెల్ మళ్లీ జట్టులోకి వచ్చాడని పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ తెలిపాడు.

విశాఖపట్నం: ఐపీఎల్-9లో భాగంగా శుక్రవారమిక్కడ జరుగుతున్న 43వ లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్  ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు అనుకూలించేలా పిచ్ ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. తమ టీమ్ ఒక మార్పు జరిగిందని చెప్పాడు. పార్థీవ్ పటేల్ స్థానంలో ఉన్ముక్త్ చాంద్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నామని పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ అన్నాడు. తమ జట్టులో రెండు మార్పులు జరిగాయని చెప్పాడు. మ్యాక్స్ వెల్ మళ్లీ జట్టులోకి వచ్చాడని, అనురీత్ సింగ్ స్థానంలో గురుకీరత్ ను తీసుకున్నామని వెల్లడించాడు. ఇప్పటి వరకు సరైన ఇన్నింగ్స్ ఆడకపోవడంతో గత మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ ను తొలగించారు. పాయింట్ల పట్టికలో ముంబై ఐదో స్థానంలో ఉండగా, పంజాబ్ చివరి స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement