
ముంబై ఇండియన్స్ కు ఛాన్స్ లేదా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇక కేవలం నాకౌట్ సమరం మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సీజన్ కు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది.
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇక కేవలం నాకౌట్ సమరం మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సీజన్ కు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్ దశలో నిలిచిన నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ చరిత్ర ఏం చెబుతుంది అనే దానిపై చర్చ మొదలైంది. ప్రధానంగా లీగ్ దశలో టాప్ ప్లేస్లో నిలిచిన ముంబై ఇండియన్స్ పైనే అందరి దృష్టి ఉంది.
ఇక్కడ టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్లలో గెలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉండగా,ఓడిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో ఆడే అవకాశం ఉంది. ఎలిమినేటర్ రౌండ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-1లో పరాజయం చెందిన జట్టు ఆడుతుంది. దాంతో టాప్ -2లో ఉన్న ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ లకు ఇది కచ్చితంగా అదనపు అవకాశంగానే చెప్పొచ్చు. ఇక్కడ 14 మ్యాచ్ ల్లో 10 మ్యాచ్ లు గెలిచి 20 పాయింట్లతో ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ ను ఆక్రమించగా, 9 మ్యాచ్ ల్లో విజయంతో 18 పాయింట్లు సాధించిన పుణె రెండో స్థానాన్ని దక్కించుకుంది. మరొకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్(17పాయింట్లు) మూడో స్థానంలో, కేకేఆర్(16 పాయింట్లు) నాల్గో స్థానంలో నిలిచాయి.
ఇంతవరకూ బాగానే ఉన్నా లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు లేవనేది ఐపీఎల్ చరిత్ర స్పష్టం చేస్తోంది. ప్రధానంగా 2011 లో ప్లే ఆఫ్ పద్ధతిని ప్రవేశపెట్టాక లీగ్ దశలో తొలి స్థానంలో ఉన్న జట్టు ట్రోఫీని గెలిచిన సందర్భాలు లేవు. దాంతో ప్రస్తుతం టాప్ లో ఉన్న ముంబై ఇండియన్స్ కూడా ట్రోఫీని గెలిచే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. మరి ఈ సెంటిమెంట్ కు ముంబై ఇండియన్స్ చెక్ పెడుతుందో లేదో చూడాలి.
2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లను పరిశీలిస్తే..
2011:ఆర్సీబీ(1) వర్సెస్ సీఎస్కే (2)-విజేత సీఎస్కే
2012: కేకేఆర్(2)వర్సెస్ సీఎస్కే(4)-విజేత కేకేఆర్
2013: సీఎస్కే(1) వర్సెస్ ముంబై ఇండియన్స్(2)- విజేత ముంబై ఇండియన్స్
2014: కింగ్స్ పంజాబ్(1) వర్సెస్ కేకేఆర్(2) -విజేత కేకేఆర్
2015:సీఎస్కే(1)వర్సెస్ ముంబై ఇండియన్స్(2)-విజేత ముంబై
2016:ఆర్సీబీ(2) వర్సెస్ ఎస్ఆర్హెచ్(3)- విజేత ఎస్ఆర్హెచ్