సచిన్‌ ఫ్యాన్‌కు ధోని విందు..! | MS Dhoni Hosts Lunch For Cricket Die Hard Fan Sudhir Gautam | Sakshi
Sakshi News home page

సచిన్‌ ఫ్యాన్‌కు ధోని విందు..!

Jun 2 2018 9:54 AM | Updated on Jun 2 2018 10:46 AM

MS Dhoni Hosts Lunch For Cricket Die Hard Fan Sudhir Gautam - Sakshi

ధోని ఫ్యామిలీతో సుధీర్‌ కుమార్‌ గౌతమ్‌ (ట్విటర్‌ ఫొటోలు)

రాంచి : మిస్టర్‌ కూల్‌ ధోనికి ఆటతో అభిమానులను అలరించడమే కాదు.. చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లతో వారిని సంతోషపెట్టడం కూడా తెలుసు. అలాగే గురువారం కూడా క్రికెట్‌ వీరాభిమాని సుధీర్‌ గౌతమ్‌కు విందు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. ధోని ఫామ్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన సుధీర్‌.. ‘ కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనితో ఒక ప్రత్యేకమైన రోజు. ఫామ్‌హౌజ్‌లో సూపర్‌ ఫ్యామిలితో సూపర్‌ లంచ్‌. ఆ అద్భుతమైన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. ధోని, సాక్షి అక్కకు ధన్యవాదాలు. ఐపీఎల్‌ విజయానంతరం కెప్టెన్‌ సేదతీరుతున్నాడు’  అంటూ ట్విటర్‌ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

సచిన్‌ టెండూల్కర్‌ వీరాభిమానిగా గుర్తింపు పొందిన సుధీర్‌ గౌతమ్‌.. ధోని అంటే కూడా ప్రత్యేక అభిమానం కనబరుస్తాడు. సచిన్‌ మ్యాచ్‌లు వీక్షించడం కోసం ఎన్నోసార్లు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లకు సైతం సైకిల్‌పై ప్రయాణించి అభిమానానికి హద్దులతో పనిలేదని నిరూపించాడు సుధీర్‌ గౌతమ్‌. ఒంటి నిండా జెండా రంగులతో, చేతుల్లో జాతీయ జెండాతో టీమిండియాకు సపోర్టుగా నిలిచే సుధీర్ క్రికెట్‌ వీరాభిమానిగా గుర్తింపు పొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement