మహేంద్ర సింగ్ ధోనీకి తన కెరీర్‌లో మరో మైలు రాయికి అడుగు దూరంలో ఉన్నాడు.
సాక్షి, కొలంబో: మహేంద్ర సింగ్ ధోనీకి తన కెరీర్‌లో మరో మైలు రాయికి అడుగు దూరంలో ఉన్నాడు. తన వన్డే కెరీర్‌లో అతను 300వ మ్యాచ్ ఆడబోతున్నాడు. వన్డే క్రికెట్లో గొప్ప ఫినిషర్‌గా పేరున్న ధోని మూడు వందల మ్యాచ్‌లు ఆడిన ఆరో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. అంతకు ముందు సచిన్ టెండూల్కర్(463), రాహుల్ ద్రవిడ్ (344), అజహరుద్దీన్ (334), సౌరభ్ గంగూలీ (311), యువరాజ్ సింగ్ (304) మ్యాచ్‌లు ఆడిన లిస్టులో ఉన్నారు.
అంతేకాకుండా ధోని మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అత్యధిక స్టంపింగ్ చేసిన ఆటగాడి జాబితాలో కూడా చేరనున్నాడు. ప్రస్తుతం 99 స్టంపింగ్‌లతో శ్రీలంక మాజీ దిగ్గజ ఆటగాడు, వికెట్ కీపర్ కుమార సంగక్కరతో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు. మరొక స్టంపింగ్ చేస్తే తన తన రికార్డును తానే తిరగ రాసుకున్న కీపర్‌గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం 72 అజేయ ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించిన షాన్ పోలాక్, చమింద వాస్ సరసన నిలిచాడు. ధోని ఆడుతున్న మూడు వందల వన్డే మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు తిరగ రాయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ధోని తాజాగా వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ధోని కేవలం 296 మ్యాచ్‌ల్లో 9608 పరుగులు చేశాడు. ధోని కంటే ముందుగా సచిన్ టెండూల్కర్(11,426), సౌరవ్ గంగూలీ(11,221), రాహుల్ ద్రవిడ్(10,768)లు మొదటి స్థానాల్లో ఉన్నారు.