మెస్సీ.... జర్మనీని ఓడించు! | Messi seeks revenge for 1990 final defeat by Germany | Sakshi
Sakshi News home page

మెస్సీ.... జర్మనీని ఓడించు!

Jul 12 2014 1:08 AM | Updated on Oct 22 2018 5:58 PM

మెస్సీ.... జర్మనీని ఓడించు! - Sakshi

మెస్సీ.... జర్మనీని ఓడించు!

ర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ... ఆదివారం జరిగే సాకర్ ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ జట్టును ఓడించాలని బ్రెజిల్ స్ట్రయికర్ నెయ్‌మార్ కోరుకుంటున్నాడు.

బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ కోరిక
 టెరోసోపోలీస్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ... ఆదివారం జరిగే సాకర్ ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ జట్టును ఓడించాలని బ్రెజిల్ స్ట్రయికర్ నెయ్‌మార్ కోరుకుంటున్నాడు. ఈసారి ట్రోఫీ తన బార్సిలోనా జట్టు సహచరుడు మెస్సీకే దక్కాలన్నాడు. ‘మెస్సీ కెరీర్‌లో ఇది చాలా ప్రధానమైంది.
 
 అతను చాలా రకాల ట్రోఫీలు గెలిచాడు. ఇది కూడా గెలిస్తే బాగుంటుంది. అతను నాకు మంచి స్నేహితుడు, సహచరుడు కూడా. అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా’ అని నెయ్‌మార్ పేర్కొన్నాడు. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో కొలంబియా డిఫెండర్ కామిల్లో జునిగా గట్టిగా ఢీకొట్టడంతో నెయ్‌మార్ మూడో వెన్నుపూసలో పగులు ఏర్పడింది. దీంతో అర్ధంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
 
 తన గాయం మరో రెండు సెంటిమీటర్లు పైన తగిలి ఉంటే వీల్‌చైర్‌కు పరిమితం కావాల్సి వచ్చేదని స్ట్రయికర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుత గాయం పెద్ద ప్రమాదమైంది కాదని తేలింది. మరో రెండు సెంటిమీటర్లు పైన తగిలితే ఇక నా పని అయిపోయేది. ఊహించడానికే ఇది భయానకంగా ఉంది. నా కెరీర్ కీలక దశలో ఇలా జరిగింది. ఏదేమైనా దీన్ని భరించాల్సిందే. జునిగా దుర్బుద్ధితో చేశాడని నేను అనుకోను. ఎవరైనా వెనుక నుంచి వచ్చి తగిలినప్పుడు మనం కూడా ఏమీ చేయలేం. మనల్ని అదుపు చేసుకోలేం కాబట్టి ఏదో ఓ దెబ్బ తగలాల్సిందే’ అని నెయ్‌మార్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement