
హో చి మిన్ సిటీ (వియత్నాం): తన పాత వెయిట్ కేటగిరికి మారిపోయాక బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ శుభారంభం చేసింది. గురువారం మొదలైన ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ (48 కేజీలు)తోపాటు శిక్ష (54 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
తొలి రౌండ్‌లో 35 ఏళ్ల మేరీకోమ్ వియత్నాం బాక్సర్ దియెమ్ తి ట్రిన్ కియుపై... ఒయున్ ఎర్డెన్ నెర్గుయి (మంగోలియా)పై శిక్ష విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో మెంగ్ చియె పింగ్ (చైనీస్ తైపీ)తో మేరీకోమ్; కొషిమోవాతో శిక్ష తలపడతారు.