జైపూర్ ఫెస్టివల్కు మేరీ కోమ్ డుమ్మా | Mary Kom cancels visit to Jaipur Literature Festival | Sakshi
Sakshi News home page

జైపూర్ ఫెస్టివల్కు మేరీ కోమ్ డుమ్మా

Jan 21 2014 3:20 PM | Updated on Sep 2 2017 2:51 AM

జైపూర్ ఫెస్టివల్కు మేరీ కోమ్ డుమ్మా

జైపూర్ ఫెస్టివల్కు మేరీ కోమ్ డుమ్మా

భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్ జైపూర్ పర్యటన రద్దు చేసుకున్నారు. తన కూతురికి అనారోగ్యంగా ఉండడంతో ఆమె జైపూర్ సాహిత్య ఉత్సవానికి వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకున్నారు.

జైపూర్: భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్ జైపూర్ పర్యటన రద్దు చేసుకున్నారు. తన కూతురికి అనారోగ్యంగా ఉండడంతో ఆమె జైపూర్ సాహిత్య ఉత్సవానికి వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. ఇటీవల లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి మేరీ కోమ్ కుమార్తె ఆరోగ్యం క్షీణించిందని, దీంతో మేరీ కోమ్.. జైపూర్ పర్యటన రద్దు చేసుకున్నారని ఆమె మేనేజర్ జి్మీ లివియన్ తెలిపారు.

జైపూర్ సాహిత్య ఉత్సవంలో 'పుల్లింగ్ ద పంచ్' పేరుతో నిర్వహించనున్న విభాగంలో రచయిత అమృత త్రిపాఠితో ఆమె చర్చా కార్యక్రమంలో పాల్గొనాల్సివుంది. మేరీ కోమ్ గైర్హాజరీతో ఆమె పాల్గొనదలిచిన కార్యక్రమం పేరును 'నో మోర్ పంచ్'గా మార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement