జనవరిలో షరపోవా పునరాగమనం! | Maria Sharapova may start playing from January 2017 | Sakshi
Sakshi News home page

జనవరిలో షరపోవా పునరాగమనం!

Aug 15 2016 5:06 PM | Updated on Sep 4 2017 9:24 AM

జనవరిలో షరపోవా పునరాగమనం!

జనవరిలో షరపోవా పునరాగమనం!

రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా వచ్చే ఏడాది నుంచి బరిలోకి దిగే అవకాశముంది.

రియో డీ జనీరో: రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా వచ్చే ఏడాది నుంచి బరిలోకి దిగే అవకాశముంది. 2017, జనవరిలో షరపోవా రాకెట్ చేతబట్టనుందని రష్యా టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు షామిల్ తార్పిష్చెవ్ తెలిపారు. రియో ఒలింపిక్స్ లో ఆయన ఈ విషయం వెల్లడించారు.

'షరపోవా పునరాగమనంపై సెస్టెంబర్ లో నిర్ణయం తీసుకునే అవకాశముంది. కచ్చితంగా చెప్పలేను కానీ వచ్చే ఏడాది జనవరి నుంచి ఆమె మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయ'ని షామిల్ చెప్పారు. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన షరపోవా రెండేళ్లు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్ లోనూ ఆడే అవకాశం  దక్కలేదు.

Advertisement
 
Advertisement
Advertisement