దక్షిణాఫ్రికాతో వార్మప్ టి20 మ్యాచ్‌లో తలపడే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. ఈ నెల 29న ఢిల్లీలో
వార్మప్ టి20కి భారత ‘ఎ’ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో వార్మప్ టి20 మ్యాచ్‌లో తలపడే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా జట్టు సుదీర్ఘ పర్యటన ప్రారంభమవుతుంది. ఇందులో చాలా మంది ఐపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకోగా...చహల్, నేగి, పాండ్యా మినహా మిగతావారంతా భారత ‘ఎ’ తరఫున గతంలో ఆడినవారే.
జట్టు వివరాలు: మన్‌దీప్ సింగ్ (కెప్టెన్), వోహ్రా, మనీశ్ పాండే, మయాంక్, సూర్యకుమార్, శామ్సన్, హార్దిక్ పాండ్యా, రిషి ధావన్, అనురీత్, చహల్, నేగి, కుల్దీప్
ఇషాంత్‌కు చోటు లేదు...
మరో వైపు రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన ఢిల్లీ జట్టులో భారత పేసర్ ఇషాంత్ శర్మకు స్థానం లభించలేదు. గౌతం గంభీర్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రంజీల్లో ఆడటం గురించి తమ ఫోన్ కాల్‌కు గానీ సంక్షిప్త సందేశానికి గానీ ఇషాంత్ స్పందించలేదని... అందుకే అతడిని ఎంపిక చేయలేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ వినయ్ లాంబా చెప్పారు. భారత వన్డే, టి20 టీమ్‌లోకి ఎంపిక కాని ఇషాంత్‌కు టెస్టు సిరీస్‌కు ముందు రంజీల్లో ఆడేందుకు తగినంత సమయం ఉంది.