హామిల్టన్‌కు ‘పోల్‌’ | Lewis Hamilton takes pole position at Spanish GP ahead of Sebastian | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌కు ‘పోల్‌’

May 14 2017 2:02 AM | Updated on Aug 21 2018 9:00 PM

హామిల్టన్‌కు ‘పోల్‌’ - Sakshi

హామిల్టన్‌కు ‘పోల్‌’

స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హామిల్టన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం

బార్సిలోనా: స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హామిల్టన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 19.149 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు.

 ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది మూడో ‘పోల్‌’ కావడం విశేషం. వెటెల్‌ (ఫెరారీ), బొటాస్‌ (మెర్సిడెస్‌), రైకోనెన్‌ (ఫెరారీ), వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్‌ వరుసగా ఎనిమిది, పది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement