ఫుట్‌బాల్‌ లెజెండ్‌ కన్నుమూత

Leeds United legend Jack Charlton has died  - Sakshi

లెజెండరీ ఫుట్‌బాల్‌ ఆటగాడు, ఇంగ్లాండ్ 1966 ప్రపంచకప్ విజేత జాక్‌ చార్లటన్‌ (85) ఇకలేరు. మాజీ ఐర్లాండ్ మేనేజర్ జాక్ లింఫోమా కాన్సర్‌, డిమెన్షియాతో బాధపడు తున్నారు. జాక్‌ నిన్న శుక్రవారం) కన్నుమూశారని ఆయన కుటుంబం ప్రకటించింది. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచం మూగబోయింది. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ ఫుట్‌ బాల్‌​ క్లబ్‌లు, ఆటగాళ్లు ఆయన మృతికి నివాళులు అర్పించారు.

జాక్‌ మనవరాలు, జర్నలిస్ట్ ఎమ్మా విల్కిన్‌ సన్‌, లీడ్స్ యునైటెడ్‌తోపాటు, ఫుట్‌బాల్‌ ప్రేమికులు, అభిమానులు జాక్‌కు ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు. అద్భుతమైన డిఫెండర్‌గా రాణించిన జాక్‌ లీడ్స్ యునైటెడ్‌కు 21 సంవత్సరాల పాటు 773 ఆటలను ఆడారు. అనంతరం రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మేనేజర్‌గా దశాబ్దం పాటు సేవలందించారు. ఇటలీలో జరిగిన 1990 ప్రపంచ కప్ లో జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కు తీసుకెళ్లిన ఘనత జాక్‌ది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top