పేస్‌ జంట పరాజయం | Leander Paes, Rico Open Tennis Tournament | Sakshi
Sakshi News home page

పేస్‌ జంట పరాజయం

Jun 15 2017 1:19 AM | Updated on Sep 5 2017 1:37 PM

రికో ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–స్కాట్‌ లిప్‌స్కీ (అమెరికా) జంట పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో పేస్‌

ఎస్‌హెర్టోజెన్‌బాష్‌ (నెదర్లాండ్స్‌): రికో ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–స్కాట్‌ లిప్‌స్కీ (అమెరికా) జంట పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో పేస్‌–లిప్‌స్కీ జోడీ 4–6, 4–6తో రెండో సీడ్‌ రావెన్‌ క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా)–రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. మరోవైపు తొలి రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా (భారత్‌) జోడీ 3–6, 4–6తో మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌)–ఆండ్రి సా (బ్రెజిల్‌) జంట చేతిలో పరాజయం పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement