కివీస్‌ దీటైన జవాబు

Latham century helps New Zealand dominate - Sakshi

లాథమ్‌ సెంచరీ

శ్రీలంకతో రెండో టెస్టు

కొలంబో: ఎట్టకేలకు శ్రీలంక–న్యూజిలాండ్‌ రెండో టెస్టుకు వరుణుడు అడ్డు తొలగాడు. తొలి రెండు రోజులు వర్షంతో సగం ఆట కూడా సాగని ఈ మ్యాచ్‌లో శనివారం మాత్రం పూర్తి ఓవర్లు పడ్డాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 144/6తో మూడో రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక 90.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా (109; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె (65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. సౌతీ (4/63), బౌల్ట్‌ (3/75) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్‌ రోజు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. టామ్‌ లాథమ్‌ (111 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (20), టేలర్‌ (23), నికొల్స్‌ (15) ఎక్కువసేపు నిలువలేదు. లాథమ్‌కు కీపర్‌ వాట్లింగ్‌ (25 బ్యాటింగ్‌) సహకారం అందించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top