సన్‌రైజర్స్‌కు సంగక్కర ఆడట్లేదు | Kumar Sangakkara opts out of playing for Sunrisers in Champions League | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌కు సంగక్కర ఆడట్లేదు

Aug 30 2013 2:50 AM | Updated on Sep 1 2017 10:14 PM

సన్‌రైజర్స్‌కు సంగక్కర ఆడట్లేదు

సన్‌రైజర్స్‌కు సంగక్కర ఆడట్లేదు

ఈ ఏడాది చాంపియన్స్ లీగ్‌లో లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడటం లేదు. తమ దేశవాళీ జట్టు కుందురత తరఫున అతను బరిలోకి దిగుతున్నాడు.

 కొలంబో: ఈ ఏడాది చాంపియన్స్ లీగ్‌లో లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడటం లేదు. తమ దేశవాళీ జట్టు కుందురత తరఫున అతను బరిలోకి దిగుతున్నాడు.
 
 లంక ప్రీమియర్ లీగ్ రద్దు కావడంతో సూపర్ 4 లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కుందురత జట్టు చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించింది. దీంతో తమ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తానని సంగక్కర స్పష్టం చేశాడు. లంక బోర్డు కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నాడు. ఐపీఎల్-6లో సన్‌రైజర్స్‌కు ఆడిన ఈ లంక మాజీ కెప్టెన్‌ను చాలా మ్యాచ్‌ల్లో పక్కనబెట్టారు. అయితే విండీస్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌తో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను గాడిలో పడ్డాడు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement