ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏడో సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ శుభారంభం చేసింది. బుధవారమిక్కడ ఆరంభమైన లీగ్ తొలి మ్యాచ్లో కోల్కతా 41 పరుగులతో ముంబయి ఇండియన్స్పై ఘన విజయం సాధించింది.
అబుదాబీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏడో సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ శుభారంభం చేసింది. బుధవారమిక్కడ ఆరంభమైన లీగ్ తొలి మ్యాచ్లో కోల్కతా 41 పరుగులతో ముంబయి ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 122 పరుగులకే చేయగలిగింది. తెలుగుతేజం అంబటి రాయుడు (48) టాప్ స్కోరర్. రోహిత్ 27, తరె 24 పరుగులు చేశారు. నరైన్ నాలుగు వికెట్లు తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 163 పరుగులు చేసింది. గంభీర్ (౦) సున్నా చుట్టేసినా కలిస్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 72), మనీష్ పాండే (53 బంతుల్లో 64) మెరుపు హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. ముంబయి పేసర్ మలింగ నాలుగు వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.