టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా | Kolkata Knight Riders win the toss and choose field | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా

May 14 2015 7:38 PM | Updated on Sep 3 2017 2:02 AM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా

ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ వాంఖడే స్టేడియంలో గురువారం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ముంబై: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ వాంఖడే స్టేడియంలో గురువారం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టంగా మార్చుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు చేరగా, కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం లీగ్ దశను దాటడానికి ఒక్క మ్యాచ్ లో విజయం సాధిస్తే చాలు. ఈ క్రమంలో ముంబై-కోల్ కతాల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.


పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకోగా,  కోల్ కతా 15 పాయింట్లతో ప్లే ఆఫ్ కు ఒక అడుగు దూరంలో ఉంది. మూడు, నాలుగు స్థానాల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement