కోల్కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్లతో హైదరాబాద్పై విజయం సాధించింది.
హైదరాబాద్: సొంతగడ్డపై హైదరాబాద్ సన్రైజర్స్కు నిరాశ ఎదురైంది. కోల్కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్లతో హైదరాబాద్పై విజయం సాధించింది. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా మరో రెండు బంతులు మిగిలుండగా మూడు వికెట్లకు విజయతీరాలకు చేరింది. రాబిన్ ఊతప్ప 40, మనీష్ పాండే 35, యూసుఫ్ పఠాన్ 39 (నాటౌట్), టెన్ డస్కాటే 25 (నాటౌట్) పరుగుల చేశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 142 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 19, నమన్ ఓజా 22, డేవిడ్ వార్నర్ 34, ఇర్ఫాన్ పఠాన్ 23 (నాటౌట్) పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లు ఉమేష్ మూడు, షకీబల్ రెండు వికెట్లు తీశారు.