కోహ్లి సెంచరీ.. మరో అరుదైన రికార్డు 

Kohli century in Cape town odi against south africa - Sakshi

సిరీస్‌లో రెండో సెంచరీ నమోదు

కేప్‌టౌన్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో శతకం సాధించాడు. దీంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లి, రెండో వన్డేలో 46 నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో వన్డేలో సైతం 119 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్‌లో 34వ సెంచరీ నమోదు చేశాడు.

ఈ సెంచరీతో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. 54 సెంచరీలతో ఇప్పటి వరకు ఈ స్థానంలో హాషిమ్‌ ఆమ్లా( దక్షిణాఫ్రికా), మహేళా జయవర్ధనే(శ్రీలంక)లతో నిలిచిన కోహ్లి తాజా సెంచరీతో వారిని వెనక్కి నెట్టాడు. వన్డేల్లో 34, టెస్టుల్లో 21 సెంచరీలతో కలపి కోహ్లి మొత్తం 55 సెంచరీలు చేశాడు.

ఇక తొలి స్థానంలో సచిన్‌(100) ఉండగా.. పాంటింగ్‌(ఆస్ట్రేలియా) 71, సంగక్కర(శ్రీలంక) 63,  జాక్వస్‌ కల్లీస్‌(దక్షిణాఫ్రికా) 62లు కోహ్లికన్నా ముందు వరుసలో ఉన్నారు. కోహ్లి భవిష్యత్తులో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్‌ను అధిగమించడం అతిశయోక్తికాదు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top