ప్లే ఆఫ్‌కు కొచ్చి బ్లూ స్పైకర్స్‌ | Kochi Blue Spikers makes the last four | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్‌కు కొచ్చి బ్లూ స్పైకర్స్‌

Feb 12 2019 10:22 AM | Updated on Feb 12 2019 10:22 AM

Kochi Blue Spikers makes the last four - Sakshi

ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌ జట్టు నాలుగో విజయం సాధించి ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించింది. చెన్నై స్పార్టన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కొచ్చి 12–15, 10–15, 15–11, 15–13, 15–10తో గెలిచింది.

కొచ్చి తరఫున ప్రభాకరన్‌ 12 పాయింట్లు, ప్రవీణ్‌ కుమార్‌ 11 పాయింట్లు స్కోరు చేశారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ఐదు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న కొచ్చి నాలుగు విజయాలు సాధించి ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో బ్లాక్‌ హాక్స్‌ హైదరాబాద్‌తో యు ముంబా వ్యాలీ జట్టు తలపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement