కొచ్చిపై విజయంతో ఫైనల్లో చెన్నై స్పార్టన్స్‌ | Chennai Spartans make Pro Volleyball League final | Sakshi
Sakshi News home page

కొచ్చిపై విజయంతో ఫైనల్లో చెన్నై స్పార్టన్స్‌

Feb 21 2019 10:17 AM | Updated on Feb 21 2019 10:17 AM

Chennai Spartans make Pro Volleyball League final - Sakshi

చెన్నై: ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్‌ జట్టు టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో చెన్నై స్పార్టన్స్‌ 16–14, 9–15, 10–15, 15–8, 15–13తో విజయం సాధించింది.

స్పైక్‌ షాట్‌ల ద్వారా 47 పాయింట్లు సాధించిన చెన్నై... బ్లాకింగ్‌లో నాలుగు, సర్వీస్‌లో మూడు పాయింట్లు గెలిచింది. చెన్నై తరఫున రుస్లాన్స్‌ సోరోకిన్స్‌ 17 పాయింట్లు... నవీన్‌ రాజా జాకబ్‌ 13 పాయింట్లు స్కోరు చేశారు. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం జరిగే ఫైనల్లో కాలికట్‌ హీరోస్‌తో చెన్నై స్పార్టన్స్‌ జట్టు తలపడుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement