Prime Volleyball League: త్వరలోనే కొత్త లీగ్‌.. హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ సహా 6 జట్లు

Hyderabad: Prime Volleyball League To Start Soon 6 Teams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాలీబాల్‌ క్రీడను మరింత ఆకర్షణీయంగా మార్చే క్రమంలో కొత్తగా మరో లీగ్‌ తెరపైకి వచ్చింది. ‘ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌’ పేరుతో దీనిని నిర్వహించనున్నారు. ఇందులో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెన్డోస్, కాలికట్‌ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ పేర్లతో ఆరు నగరాలకు చెందిన జట్లు ఉంటాయి. ఈ టోర్నీ వివరాలను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో జరిగే ఈ టోర్నీ కోసం వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.

2019లో జరిగిన ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో స్వల్ప మార్పులు చేసి కొత్తగా ఈ టోర్నీని ముందుకు తెచ్చారు. ఫ్రాంచైజీల చేతుల్లోనే టోర్నీ మొత్తం యాజమాన్య హక్కులు ఉండే పద్ధతిలో తొలిసారి ఇలాంటి టోర్నమెంట్‌ జరగనుందని ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ లీగ్‌ సీఈఓ జాయ్‌ భట్టాచార్య వెల్లడించారు. ఆన్‌లైన్‌ కంపెనీ ఏ23, ప్లేయర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ బేస్‌లైన్‌ వెంచర్స్‌ లీగ్‌లో ప్రధాన భాగస్వాములు కాగా... సోనీ నెట్‌వర్క్‌ ఈ లీగ్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. కార్యక్రమంలో టీమ్‌ల యజమానులు, సోనీ ప్రతినిధులతో పాటు భారత మాజీ వాలీబాల్‌ క్రీడాకారుడు పీవీ రమణ కూడా పాల్గొన్నారు. 

చదవండి: Neeraj Chopra: ఒలింపిక్‌ రికార్డును సవరించాల్సి ఉంది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top