
ప్రొ వాలీబాల్ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో చెన్నై స్పార్టన్స్ 15–11, 15–12, 16–14తో కాలికట్ హీరోస్‌ను ఓడించింది. లీగ్ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ చేరిన కాలికట్ హీరోస్ తుది పోరులో చతికిలపడటం గమనార్హం.
చెన్నై తరఫున రూడీ వెరోఫ్ 13 పాయింట్లు స్కోరు చేయగా... కాలికట్ తరఫున అజిత్ లాల్ తొమ్మిది పాయింట్లు సంపాదించాడు. ఈ విజయంతో చెన్నై స్పార్టన్స్ జట్టు ఆసియా పురుషుల క్లబ్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.