ప్లేఆఫ్‌ బెర్తే లక్ష్యంగా కేకేఆర్‌ | KKR seek play offs berth, Mumbai look to finish in top two | Sakshi
Sakshi News home page

ప్లేఆఫ్‌ బెర్తే లక్ష్యంగా కేకేఆర్‌

May 5 2019 7:36 PM | Updated on May 5 2019 8:04 PM

KKR seek play offs berth, Mumbai look to finish in top two - Sakshi

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకోగా, కోల్‌కతా ఇంకా ప్లేఆఫ్‌ రేసులోనే ఉంది. ఇది ఈ సీజన్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ కావడంతో పాటు కేకేఆర్‌ గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుతుంది. దాంతో ప్లేఆఫ్‌ బెర్తే లక్ష్యంగా కేకేఆర్‌ బరిలోకి దిగుతోంది. ఒకవేళ కేకేఆర్‌ ఓడితే మాత్రం నెట్‌రన్‌ రేట్‌ ఆధారంగా సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. గెలిస్తే ఎంచక్కా ప్లే ఆఫ్‌  చేరే మ్యాచ్‌లో బాధ్యతారహితంగా ఆడి ఓడింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ మినహా బ్యాటింగ్‌లో చేతులెత్తేశారు. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓడితేనే హైదరాబాద్‌ రన్‌రేట్‌ ప్రకారం ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ముంబైపై కోల్‌కతా గెలిస్తే మాత్రం హైదరాబాద్‌ ఇంటిముఖం పడుతుంది. కోల్‌కతా చివరి బెర్త్‌ దక్కించుకుంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement