శ్రీకాంత్‌ ఆట ముగిసె...

Kidambi Srikanth crashes out in 1st round after losing to Chen Long - Sakshi

సింధు ముందంజ

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్‌వన్‌ పూసర్ల వెంకట సింధు ముందంజ వేసింది. పురుషుల కేటగిరీలో శ్రీకాంత్‌ ఆట తొలి రౌండ్‌తోనే ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌ పోరులో స్టార్‌ షట్లర్, ఆరో సీడ్‌ సింధు 21–14, 21–17తో బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)పై గెలుపొందింది. ఈ పోరులో సింధు నిలకడైన ఆటతీరు కనబరిచింది. ఆఖరి దాకా పైచేయి సాధించిన భారత స్టార్‌ వరుస గేముల్లో 42 నిమిషాల్లో ఈ ఆటను ముగించింది.

పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 15–21, 16–21తో చైనాకు చెందిన మూడో సీడ్‌ చెన్‌ లాంగ్‌ చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ మొదటి రౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ జెర్రి చోప్రా ద్వయం 13–21, 21–11, 17–21తో చైనా టాప్‌ సీడ్‌ ద్వయం జెంగ్‌ సి వీ– హ్యుయంగ్‌ య కియోంగ్‌ చేతిలో పరాజయం పాలైంది. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం సిక్కి–అశ్విని పొన్నప్ప జంట ముందంజ వేసింది. భారత జోడీ 5–4తో ఆధిక్యంలో ఉన్న దశలో జెన్నీ మూర్‌–విక్టోరియా విలియమ్స్‌ (ఇంగ్లండ్‌) జంట రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top