రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం..

Kidambi And Sameer Knocked Out Of Korea Masters - Sakshi

గ్వాంగ్‌జు(కొరియా): భారత షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కొరియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 టోర్నమెంట్‌లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోరులో శ్రీకాంత్‌ 14-21, 19-21 తేడాతో కంటా సునేయామా(జపాన్‌)చేతిలో పరాజయం చవిచూశాడు. సునేయామాతో తొలిసారి తలపడిన శ్రీకాంత్‌ ఎటువంటి వరుస రెండు గేమ్‌లు సమర్పించుకుని ఓటమి పాలయ్యాడు. కేవలం 37 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు.

తొలి గేమ్‌ను దారుణగా కోల్పోయిన శ్రీకాంత్‌.. రెండో గేమ్‌ చివర్లో కాస్త ప్రతిఘటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన శ్రీకాంత్‌.. అప్పట్నుంచీ తిరిగి గాడిలో పడటానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం నమోదు చేయడం లేదు. ఇక భారత షట్లర్‌ సమీర్‌ వర్మ కథ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. దక్షిణకొరియాకు చెందిన కిమ్‌ డాంగన్‌ చేతిలో సమీర్‌ పరాజయం చెందాడు. డాంగన్‌ 21-19, 21-12 తేడాతో సమీర్‌ను బోల్తా కొట్టించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top