హా..! భారీ పాముతో బుడ్డోడి గేమ్స్‌.. క్రికెటర్‌ ఫిదా

Kevin Pietersen Posts Video of Kid Trying to Play With a Huge Snake - Sakshi

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ (కేపీ) సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటాడు. తన సోషల్‌ మీడియా ఖాతాలో ఒకింత వికృతంగా ఉండే ఫన్నీ వీడియోలు పెడుతుంటాడు. తాజాగా కేపీ ఓ విచిత్రమైన వీడియో షేర్‌ చేశాడు. అత్యంత భారీ పాముతో ఏమాత్రం బెరుకు, భయపడకుండా ఆడుతున్న బుడ్డోడి వీడియోను కేపీ షేర్‌ చేశాడు. చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న పాముతో బుడ్డుడు ఆటలు ఆడటమే కాదు.. దాని మెడ పట్టుకొని ఎత్తుకునేందుకు ప్రయత్నించడం.. ఆ పాము మీద కూచొని.. అది కదులుతుంటే.. ఎంజాయ్‌ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.‘వాట్‌ ఆన్‌ ఎర్త్‌’ అంటూ కేపీ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top