breaking news
kid video
-
ఏమీ ఎరుగని పూవుల్లారా!
ఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!..రెండేళ్ల వయసులో ఎలా ఉండాలి?.. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ.. తల్లిదండ్రుల ఒడిలో సేదతీరుతూ ఉండాలి . కానీ, ఈ చిన్నారి మాత్రం తోటి పిల్లలతో కలిసి ఎక్కడ నీరు దొరక్కుండా పోతుందా? అనే భయంతో పరుగులు ఇలా పెడుతోంది. తమ బిడ్డలకు అందమైన బాల్యం చెక్కాలని ఆ దేవుడ్ని మొక్కుకోని తల్లిదండ్రులు ఉంటారా?. కానీ, తమ బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలని వేడుకుంటున్నారు గాజా ప్రజలు.గాజా.. గత ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ దాడులతో.. తీవ్ర మానవ సంక్షోభంతో అల్లలాడుతున్న నేల. మానవతా సాయం ఆగిపోవడంతో సంక్షోభం తలెత్తి చివరకు తిండి, మంచి నీటిని కూడా పరిమితులు విధించడంతో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by عبد الرحمن ناصر | Abdulrahman Nasir (@abdulrahman_nasir7)యూనిసెఫ్ గణాంకాల ప్రకారం..ప్రస్తుతం కల్లోల గాజాలో చిన్నారులకు రోజుకి ఒకటిన్నర నుంచి 2 లీటర్ల నీరు అందిస్తున్నారు. సాధారణంగా.. అన్ని అవసరాలకు కలిపి 15 లీటర్ల నీరు ఒకరోజుకి అవసరం పడుతాయి. ఇందులో తాగు నీటికే 3 లీటర్ల అవసరం. అలాంటిది ఇక్కడి చిన్నారులకు ఒకరోజులో 2 లీటర్ల లోపే నీరు అందుతుండడం.. సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.గణాంకాలు.. కఠోర వాస్తవాలుగాజాలో 2023 అక్టోబర్ నుండి ప్రారంభమైన యుద్ధంలో వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, మరియు ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.2023లోనే గాజాలో జరిగిన దాడుల్లో పిల్లలే అత్యధికంగా మరణించారు అని జెనీవాలో యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్టర్ ప్రకటించారు.మొత్తం గాజా మరణాల్లో.. 70% మరణాలు మహిళలు మరియు పిల్లలే అని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. యుద్ధం, ఆకలి, నీటికొరత, వైద్య సౌకర్యాల లేమి కారణంగా 14,000 మంది పిల్లలు మరణించే ప్రమాదం ఉంది అని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.ఇంకా..19 లక్షల మంది స్థానభ్రంశం చెందారు, వారిలో సగానికి పైగా పిల్లలే.370 స్కూళ్లు నేలమట్టమయ్యాయి, పిల్లలు విద్యా అవకాశాలు కోల్పోయారు.నీటి లభ్యత 5%కి పడిపోయింది, దీని వల్ల డీహైడ్రేషన్తో పసికందులు మరణిస్తున్నారు.బాల్యం అనే భావన అక్కడ పూర్తిగా విచ్ఛిన్నమైందని యునిసెఫ్ పేర్కొంది. ఈ గణాంకాలు గాజాలోని పిల్లల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. *పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!అచ్చటికిచ్చటి కనుకోకుండాఎచ్చటెచటికో ఎగురుతుపోయేఈలలు వేస్తూ ఎగురుతుపోయేపిట్టల్లారా!పిల్లల్లారా!గరికిపచ్చ మైదానాల్లోనూ,తామరపూవుల కోనేరులలోపంటచేలలో, బొమ్మరిళ్లలో,తండ్రి సందిటా, తల్లి కౌగిటా,దేహధూళితో, కచభారంతో,నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండేపరమాత్మలుఓ చిరుతల్లారా!మీదే, మీదే సమస్తవిశ్వం!మీరే లోకపు భాగ్యవిధాతలు!మీ హాసంలో మెరుగులు తీరునువచ్చేనాళ్ల విభాప్రభాతములు!ఋతువుల రాణి వసంతకాలంమంత్రకవాటం తెరచుకునీ,కంచు వృషభముల అగ్నిశ్వాసంక్రక్కే గ్రీష్మం కదలాడీ,ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూఏకంచేసే వర్షాకాలం,స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,హిమానీ నిబిడ హేమంతములు,చలివడకించే శైశిరకాలంవస్తూ పోతూ దాగుడుమూతలక్రీడలాడుతవి మీ నిమత్తమే!ఇవాళలాగే ఎప్పుడు కూడాఇనబింబం పయనించు నింగిపై!ఎప్పుడు కూడా ఇవాళలాగేగాలులు వీచును, పూవులు పూచును!నాకు కనంబడు నానాతారక,లనేక వర్ణా, లనంత రోచులుదిక్కు దిక్కులా దివ్యగీతములుమీరూ వాటికి వారసులే! ఇవిమీలో కూడా మిలమిలలాడును!నా గత శైశవ రాగమాలికలప్రతిధ్వనులకై,పోయిన బాల్యపు చెరిగిన పదములచిహ్నాల కోసం,ఒంటరిగా కూర్చిండి వూరువులుకదిలే గాలికి కబళమునిస్తూ,ప్రమాద వీణలు కమాచి పాడగసెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,పాతాళానికి పల్టీకొట్టీవైతరణీనది లోతులు చూస్తూ,శాంతములే, కేకాంతముగా, దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూమెటిక విరుస్తూ ఇట కూర్చిండిననను చూస్తుంటే నవ్వొస్తోందా?ఉడుతల్లారా!బుడతల్లారా!ఇది నా గీతం, వింటారా?*సేకరణ: శ్రీశ్రీ మహాప్రస్థానం/శైశవగీతి -
హా..! భారీ పాముతో బుడ్డోడి గేమ్స్.. క్రికెటర్ ఫిదా
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ (కేపీ) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటాడు. తన సోషల్ మీడియా ఖాతాలో ఒకింత వికృతంగా ఉండే ఫన్నీ వీడియోలు పెడుతుంటాడు. తాజాగా కేపీ ఓ విచిత్రమైన వీడియో షేర్ చేశాడు. అత్యంత భారీ పాముతో ఏమాత్రం బెరుకు, భయపడకుండా ఆడుతున్న బుడ్డోడి వీడియోను కేపీ షేర్ చేశాడు. చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న పాముతో బుడ్డుడు ఆటలు ఆడటమే కాదు.. దాని మెడ పట్టుకొని ఎత్తుకునేందుకు ప్రయత్నించడం.. ఆ పాము మీద కూచొని.. అది కదులుతుంటే.. ఎంజాయ్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.‘వాట్ ఆన్ ఎర్త్’ అంటూ కేపీ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఈ వీడియో చూశాక కూడా వద్దంటారా?
జల్లికట్టు ఆటలో ఎద్దులను హింసిస్తారని, వాటి తోకలు కొరికి.. కర్రలతో బాది వాటిని పరుగులు తీయిస్తారని పెటా లాంటి జంతుహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే మూగ జీవాలను హింసించే ఇలాంటి ఆటలను నిషేధించాలని కోర్టుకెక్కాయి. కానీ, తమిళుల వాదన మరోలా ఉంది. తాము ఆవులు, ఎద్దులను ఎంతగానో ప్రేమిస్తామని, కన్న బిడ్డల్లా చూసుకుంటామని.. అలాంటి వాటిని తాము ఎందుకు హింసిస్తామని అడుగుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమిళ నటుడు విక్రమ్ ప్రభు తన ట్విట్టర్లో ఒక వీడియో షేర్ చేశారు. ఒక చిన్న పిల్లాడు ఎద్దుతో ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. అందకపోయినా కాళ్లెత్తి మరీ దాని కొమ్ములు పట్టుకుని కిందకు వంచి, గంగడోలుతో ఆడుకుని, చెవులు నిమురుతూ.. ఎంతలా దాన్ని అటూ ఇటూ తిప్పినా కొమ్ములు తిరిగిన ఆ ఎద్దు ఏమీ చేయకుండా ఊరుకుంటుంది. పిల్లాడితో ఆడుకున్నట్లుగానే కనిపిస్తుంది. తమిళనాడులో పశువుల పెంపకం ఒక మంచి సంస్కృతి అని, ఆవులు.. ఎద్దులతో తాము ఇలాగే స్నేహపూర్వకంగా ఉంటామని, అందువల్ల జల్లికట్టును సంస్కృతిలో భాగంగానే చూడాలని అంటున్నారు. స్పెయిన్లో జరిగే బుల్ఫైట్లలా కాకుండా, ఇక్కడ బహిరంగ స్థలంలో ఎడ్లను స్వేచ్ఛగా పరుగులు తీయనిస్తామని చెబుతున్నారు. ఈ వీడియో చూస్తే మాత్రం పశువుల పట్ల తాము ఎలా ఉంటామో, అవి తమతో ఎలా ఉంటాయో అందరికీ తెలుస్తుందని చెబుతున్నారు. చిన్నతనంలో తాను తమ ఇంట్లో ఉండే పశువులన్నింటినీ పేర్లుపెట్టి పిలవడం తనకు ఇంకా గుర్తుందని కూడా విక్రమ్ ప్రభు ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. -
ఈ వీడియో చూశాక కూడా వద్దంటారా?