ఓవరాల్‌ చాంప్‌ కేరళ | Kerala team's overall championship title | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంప్‌ కేరళ

Jul 19 2017 12:17 AM | Updated on Sep 5 2017 4:19 PM

జాతీయ సీనియర్‌ అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కేరళ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

సాక్షి, గుంటూరు: జాతీయ సీనియర్‌ అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కేరళ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. స్థానిక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో కేరళ 159 పాయింట్లు స్కోరు చేసింది. 110 పాయింట్లతో తమిళనాడు రెండో స్థానంలో, 101.500 పాయింట్లతో హరియాణా మూడో స్థానంలో నిలిచాయి.

 ఒక స్వర్ణం, మూడు రజతాలు గెలిచిన ఆతిథ్య ఆంధ్రప్రదేశ్‌ జట్టు 42.500 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో, ఒక కాంస్య పతకం సాధించిన తెలంగాణ ఐదు పాయింట్లతో 20వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. మహిళల విభాగంలో అను రాఘవన్‌ (400 మీటర్ల హర్డిల్స్‌–కేరళ)... పురుషుల విభాగంలో దవీందర్‌ సింగ్‌ (జావెలిన్‌ త్రో–పంజాబ్‌) ఉత్తమ అథ్లెట్స్‌గా ఎంపికయ్యారు.

పోటీల చివరి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్స్‌కు ఒక్కో పతకం లభించాయి. పురుషుల హ్యామర్‌ త్రో ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీరజ్‌ కుమార్‌ రజత పతకం గెలిచాడు. అతను హ్యామర్‌ను 64.73 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 100 మీటర్ల ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన సీహెచ్‌ సుధాకర్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అతను 10.72 సెకన్లలో గమ్యానికి చేరుకొని మూడో స్థానాన్ని సంపాదించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement