
యువరాజ్ ఛారిటీ ఈవెంట్ కు కపిల్ శర్మ
క్యాన్సర్ రోగుల సహాయార్థం నిధుల సేకరణకు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ నిర్వహించనున్న ఛారిటీ కార్యక్రమానికి కమెడియన్ కపిల్ శర్మ హాజరుకానున్నాడు.
ముంబై: క్యాన్సర్ రోగుల సహాయార్థం నిధుల సేకరణకు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ నిర్వహించనున్న ఛారిటీ కార్యక్రమానికి కమెడియన్ కపిల్ శర్మ హాజరుకానున్నాడు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఛారిటీ కార్యక్రమం కోసం లండన్ కు కపిల్ పయనమయ్యాడు.
క్యాన్సర్ బారిన పడి కోలుకున్న యువరాజ్ తన చారిటీ ‘యు వియ్ కెన్’ ఆధ్వర్యంలో ఈ నెల 14న లండన్‌లోని హిల్టన్ హోటల్‌లో క్రికెట్ జ్ఞాపికలను వేలానికి ఉంచనున్నాడు. 200వ టెస్టులో సచిన్ వేసుకున్న టీ షర్ట్, 2011 ప్రపంచకప్‌లో యువీ అందుకున్న పతకంతో పాటు పలు జ్ఞాపికలు వేలం వేస్తారు. వీటిని దక్కించుకున్న వారు యువరాజ్‌తో ప్రాక్టీస్‌లో పాల్గొనడమే కాకుండా విందు చేసే అవకాశం దక్కుతుంది. ఈ వేలానికి క్రికెట్ దిగ్గజం సచిన్, గంగూలీ, ద్రవిడ్, కెవిన్ పీటర్సన్‌తో పాటు భారత క్రికెటర్ విరాట్ కోహ్లి హాజరుకానున్నారు.